అతి పెద్ద ప్రధాన సంఖ్య మీకు తెలుసా...?

SMTV Desk 2018-01-08 16:11:50  BIGGEST PRIME NUMBER, FOUNDED,

వాషింగ్టన్, జనవరి 8 : అతి చిన్న ప్రధాన సంఖ్య అంటే చదువుకున్నవారు ఎవరైనా రెండు అని చెప్పేస్తారు.. మరి అతి పెద్ద ప్రధాన సంఖ్య అంటే ..తెగ ఆలోచిస్తారు. అయితే అతి పెద్ద ప్రధాన సంఖ్యను అమెరికాకు చెందిన జొనాథన్‌ పేస్‌ అనే 51 ఏళ్ల ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ కనుగొన్నాడు. 2ను 7,72,32,917 సార్లు గుణించి, ఆ తర్వాత అందులో నుండి ‘1’ ని తీసివేశారు. ఆ వచ్చిన సంఖ్యలో 2,32,49,425 అంకెలున్నాయి. ఇప్పటివరకు తెలిసిన ప్రధాన సంఖ్య కన్నా ఎం77232917 అని పిలుస్తున్న ఈ కొత్త ప్రధాన సంఖ్యలో దాదాపు 10 లక్షల అంకెలు ఎక్కువగా ఉన్నాయి. అత్యంత అరుదుగా ఉండే ఈ ప్రధాన సంఖ్యలను మెర్సెన్ ప్రధాన సంఖ్యలు గా పరిగణిస్తారు. రెండు ను రెండు తో గుణిస్తూ పోయే...చివరకు ఒకటి తీసివేస్తే వచ్చే సంఖ్యను మెర్సెన్ ప్రధాన సంఖ్య అంటారు.