ఎన్టీఆర్‌ పాత్రలో కల్యాణ్‌ రామ్‌ కుమారుడు..!

SMTV Desk 2018-01-08 14:30:11  kalyan ram, teja, ntr biopic movie,

హైదరాబాద్, జనవరి 8: తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్‌ బయోపిక్ చిత్ర౦పై రోజుకో వార్త వెలువడుతుంది. నిన్నటిదాకా ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్ర కోసం తేజ ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని ఉపయోగించి కథానాయికను ఎంపిక చేసుకుంటారని అన్నారు. అయితే నేడు చిన్నప్పటి ఎన్టీఆర్‌ పాత్రలో నందమూరి కల్యాణ్‌ రామ్‌ కుమారుడు శౌర్యరామ్‌ నటించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఇదే నిజమైతే శౌర్యరామ్‌ పై పలు సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలుస్తోంది. జనవరి 18న ఎన్టీఆర్‌ వర్థంతిని పురస్కరించుకుని చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేయనుంది.