రేపు ఢిల్లీలో అంతర్జాతీయ మీడియా సదస్సు

SMTV Desk 2018-01-08 13:14:12   International Media Conference in Delhi, ap amaravathi, CRDA

అమరావతి, జనవరి 8 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని 2036 నాటికి అన్ని విధాలుగా అభివృద్ధితో పాటు, అలాగే అమరావతి మీడియా నగరంలో ప్రత్యక్షంగా 60,000 ఉద్యోగాల కల్పన అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ఈ మేరకు అమరావతి నిర్మాణం పై పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి తెలియజేసేలా రేపు ఢిల్లీలో అంతర్జాతీయ మీడియా సదస్సు నిర్వహిస్తున్నట్లు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) ప్రకటించింది. సినిమా, టీవీ, యానిమేషన్‌/వీఎఫ్‌ఎక్స్/ గేమింగ్‌/డిజిటల్‌ యాడ్‌-సామాజిక మాధ్యమాలు, టెలికాం రంగాలు ఈ మీడియా నగరానికి నాలుగు స్తంభాలుగా ఉంటాయని ఆ సంస్థ వెల్లడించింది.