గంభీర్ ను చెన్నై తీసుకుంటుందా..?

SMTV Desk 2018-01-07 18:15:03  ipl, goutham gambhir, kolkatha knight riders, chennai super kings

హైదరాబాద్, జనవరి 7 : ఐపీఎల్ -11 టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ దగ్గర అట్టిపెట్టుకొనే ఆటగాళ్లను ఇటీవల ప్రకటించారు. ఇందులో కోల్ కతా నైట్ రైడర్స్(కేకేఆర్) జట్టు అనూహ్యంగా వెస్ట్ ఇండీస్ క్రీడాకారులు ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ ను ఎంపిక చేసుకుంది. కాగా రెండు సార్లు జట్టుకి విజయాలను అందించిన టీమిండియా టాప్ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ ను వదేలిసింది. అయితే తాజాగా కోల్ కతా వదిలేసిన గంభీర్‌ను వేలంలో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కొనుగోలు చేయనుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి కొందరికి? వికాస్‌ కోఠారీ అనే వ్యక్తి ‘ఐపీఎల్‌ వేలంలో ఈ సారి గౌతమ్‌ గంభీర్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ తీసుకుంటుందని నాకు గాఢంగా అనిపిస్తోంది’ అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. దానికి చెన్నై విచిత్రంగా రెండు ఎమిటోకాన్స్‌ను ఉంచి విచిత్రంగా బదులిచ్చింది. ఇప్పుడు ఈ విషయం అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఎంటంటే వేలంలో రైట్‌ టు మ్యాచ్‌ ద్వారా తక్కువ ధరకు సొంతం చేసుకోవాలన్నది వారి అసలు వ్యూహంగా కన్పిస్తుంది.