అమరావతి మారథాన్‌ లో ప్రజల ఉత్సాహం...

SMTV Desk 2018-01-07 11:35:35  ap amaravathi marthanon, vijayawada, Minister Devineni Uma Maheshwara Rao, Collector Laxmikantam, people

విజయవాడ, జనవరి 7 : నేడు ఉదయం బెజవాడలో నిర్వహించిన అమరావతి మారథాన్ కు పెద్ద ఎత్తులో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ఉండవల్లిలోని మంతెన ఆశ్రమం వరకు నిర్వహించిన ఈ పరుగును మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ లక్ష్మీకాంతం, నగర మున్సిపల్ కమిషనర్, పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉమా మాట్లాడుతూ...నగరవాసుల్లో ఆనందం, ఆరోగ్యం పెంపొందించేందుకే హాఫ్ మారథాన్, 5కే రన్, 10కే రన్ విభాగాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కాగా, ఈ అమరావతి మారథాన్‌లో సినీ తారలు గౌరి ముంజల్, శాన్వి శ్రీవాస్తవ పాల్గొని సందడి చేశారు.