పాక్ నీ వైఖరి మార్చుకో : అమెరికా

SMTV Desk 2018-01-06 17:04:56  america, pakistan, white house, terriorism issue

వాషింగ్టన్, జనవరి 6 : పాక్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంలా ఉంటోందని ఆరోపిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆగ్రహం వ్యక్త౦ చేసి వారికి ఇచ్చే నిధులను ఆపివేసిన సంగతి తెలిసిందే . ఈ విషయంపై పాక్, అమెరికా మధ్య తీవ్ర ఆరోపణలు కూడా చేసుకున్నాయి. అయితే ఉగ్రవాదుల అంశంపై పాక్‌ త్వరగా నిర్ణయం తీసుకుంటే అమెరికా పరస్పర సహకారానికే మొగ్గు చూపుతుందని వైట్‌హౌస్‌ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.." పాకిస్థాన్‌ను డీల్‌ చేయడానికి అన్ని రకాల మార్గాలు టేబుల్‌పై సిద్ధంగా ఉన్నాయి. అఫ్గానిస్థాన్‌ సరిహద్దులో ఉగ్రస్థావరాలపై పాక్‌ దాడులు జరపాలని అమెరికా ఆకాంక్షిస్తుంది. అమెరికా పరస్పర సహకారానికే మొగ్గు చూపుతుంది. ఇప్పటికైనా పాక్ తమ వైఖరి మార్చుకోవాలి. ఉగ్రవాదుల అంశంపై పాక్‌ త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని వ్యాఖ్యానించారు.