జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. నలుగురు మృతి..

SMTV Desk 2018-01-06 12:05:08  Terrorists attack on goal market, Sopore, Jammu kashmir

శ్రీనగర్, జనవరి 6: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రదాడి చోటు చేసుకుంది. బారాముల్లా జిల్లాలో సోపోర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గోల్‌ మార్కెట్‌ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. ఓ దుకాణం అడుగుభాగంలో ముష్కరులు ఈ బాంబును అమర్చినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు ధాటికి సమీపంలోని మూడు దుకాణాలు కూడా ధ్వంసమైనట్లు వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇంకా ఈ ఉగ్రదాడికి ఎవరు పాల్పడిందో తెలియాల్సి ఉంది.