కోహ్లిని జైలుకు పంపించాలి : నటుడు కమాల్

SMTV Desk 2017-06-20 14:34:12  kamal khan, virat kohli, yuvaraj,dhoni,

న్యూఢిల్లీ, జూన్ 20 : కోహ్లిని జైలుకు పంపాలని బాలీవుడ్ నటుడు కమాల్ ఖాన్ అంటున్నాడు. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే కమాల్ ఖాన్ ఈ సారి కూడా అలాంటి వ్యాఖ్యలే భారత్ క్రికెటర్లపై చేసారు. "ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టు పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడానికి కారణం కెప్టెన్ విరాట్ కోహ్లి. అతన్ని జట్టు నుంచి బహిష్కరించి జైలుకు పంపాలి. 100 కోట్ల భారతీయులను మోసం చేసారు. భారత్ జట్టు లండన్ నుంచి రాగానే ఎయిర్ పోర్టులో గుడ్లు, టమాటలతో స్వాగతం పలకాలి. కోహ్లి పాకిస్తాన్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడు. కోహ్లి బ్యాటింగ్ లో ఉన్నప్పుడు పాకిస్తాన్ ఫీల్డర్ క్యాచ్ మిస్ చేసిన తరువాత బంతిని మళ్ళి క్యాచ్ ఇవ్వడం చూస్తుంటే కోహ్లి ఫిక్సింగ్ పాల్పడ్డాడని తెలుస్తుంది. వంద కోట్ల భారతీయుల ప్రతిష్టను పాకిస్తాన్ కు అమ్మారు. కోహ్లితో పాటు యువరాజు, ధోని కూడా ఫిక్సింగ్ పాల్పడ్డ వీళ్ళను జట్టు నుంచి బహిష్కరించి జైలుకు పంపించాలని" కమాల్ ఖాన్ విమర్శించారు. ఈ ట్విట్లు చూసిన భారత్ అభిమానులు అతన్ని ట్విట్లతో సమాధానమిస్తునారు.