ఉద్యోగ అభ్యర్ధుల ఎంపికలో కీలక మార్పులు..!

SMTV Desk 2018-01-06 10:47:24  appsc, ap government, jobs recruitment, ap commission.

అమరావతి, జనవరి 6 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. రాత పరీక్ష నుండి ప్రధాన పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేసే విధానాన్ని మార్చుతున్నట్లు ప్రకటించింది. ఈ నియామకంలో ప్రస్తుతం ఉద్యోగాల సంఖ్యను బట్టి ఒక్కో ఉద్యోగానికి 50 మంది అభ్యర్థులను ప్రధాన పరీక్షకు ఎంపిక చేస్తున్నారు. ఉదాహరణకు ప్రభుత్వం 1000 పోస్టులను ప్రకటిస్తే.. ఎపీపీఎస్సీ 50,000 మందికి ఈ ప్రధాన పరీక్షలను నిర్వహిస్తోంది. దీంతో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ బాధ్యతలను కమిషన్‌కు అప్పగించి ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ విషయంపై చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఉదయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ.. 1:12 నుండి, 1: 15 నిష్పత్తి లోపు ప్రాథమిక పరీక్ష ద్వారా ప్రధాన పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తాం. ఈ ప్రక్రియలో నిర్దేశిత కటాఫ్‌ ప్రకారం సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులు లేకుంటే తగ్గిస్తాం. కమిషన్‌ జారీచేయనున్న కొత్త ఉద్యోగ ప్రకటనల జారీకి మాత్రమే కొత్త నిర్ణయం వర్తిస్తుంది. దీనివల్ల అందరికీ న్యాయం జరుగుతుంది" అని వెల్లడించారు.