ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు షాకిచ్చిన దేనా బ్యాంక్‌..!

SMTV Desk 2018-01-05 16:12:13  transtroy company, dena company, contractor, polavaram projest

పోలవరం, జనవరి 5 : పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన గుత్తేదారు ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు చెందిన వాహనాలను దేనా బ్యాంకు అధికారులు సీజ్‌ చేసినట్లు సమాచారం. దేనా బ్యాంకు కు చెల్లించాల్సిన 150 కోట్ల రుణాన్ని చెల్లించాలని లేదంటే వాహనాలను స్వాధీనం చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ పనులను ట్రాన్స్ ట్రాయ్‌ సంస్థ అప్పగించింది. దీంతో పనులు నిలిచిపోతాయేమోనన్నఆందోళన ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది. కాగా ఈ చర్యపై ప్రభుత్వాధికారులెవరూ స్పందించలేదు. ట్రాన్స్‌టాయ్‌ ఒక ప్రైవేటు సంస్థ కావడంతో అధికారులు ఎవరు కలుగచేసుకోవట్లేదు. కాగా ట్రాన్స్‌టాయ్‌, దేనా బ్యాంక్‌ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పోలవరం పనుల్లో జాప్యం జరుగుతుండడంతో అధికార టీడీపీ పార్టీ పై ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్త్యం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ సమస్య పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.