పార్టీ వీడనున్న మరో టీడీపీ నేత?

SMTV Desk 2018-01-05 15:59:03  Another TDP leader Khammam district Vaira Assembly constituency TPI Incharge Malot Randasnayak

ఖమ్మం, జవనరి 5 : టీడీపీ పార్టీలోని పలువురు నేతలు ఈ మధ్య కాలంలోనే ఇతర పార్టీలకు వెళ్లి పోవడం జరిగింది. అయితే, ప్రస్తుతం ఈ వరుసలో ఖమ్మం జిల్లా వైరా అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ మాలోతు రాందాస్‌నాయక్‌ కూడా ఉన్నట్లు సమాచారం. గురువారం చోటుచేసుకున్న పరిమాణాలతో ఆయన కాంగ్రెస్ వైపు వెళ్లబోతున్నరని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే, జిల్లాకు చెందిన పోట్ల నాగేశ్వరరావుతో కలిసి గురువారం ఢిల్లీకి వెళ్లి, రేణుకాచౌదరి ద్వారా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసినట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నంతకాలం తనకు ఏ మాత్రం కొదవ లేదని భావించిన ఆయన, రేవంత్ పార్టీని వీడటంతో టీడీపీలో కొనసాగాలా లేదా అని అయోమయంలో ఉన్నారు. ఇదిలా కుండగా, రేవంత్ రెడ్డితో ఎన్నోఏళ్లనుంచి సాన్నిహిత్యం ఉన్నందున ఇటీవల కొన్నిసార్లు ఖమ్మంలో ఆయన్ను రాందాస్‌ కలిశారనే ప్రచారమూ ఉంది. అప్పటినుంచి ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. కాంగ్రెస్‌లో తనకు భవిష్యత్‌ కల్పిస్తారనే భరోసాను రేవంత్‌రెడ్డి, రేణుకాచౌదరి, పోట్లపై ఉంచుతున్నారని అందుకే, గురువారం ఆయన నుంచి పిలుపురావటంతో రాందాస్‌నాయక్‌ ఎట్టకేలకు హైదరాబాద్‌ వెళ్లారు.