పోలవరం కాఫర్ డ్యామ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

SMTV Desk 2018-01-05 15:03:29  ap polavaram project Green signal to the Coffer Dam,

న్యూఢిల్లీ, జనవరి 5 : ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్‌కు ఏబీ పాండ్యా కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గతంలో కాఫర్ డ్యాం నిర్మాణానికి కెల్లర్ సంస్థ సిద్ధమైంది. కానీ, ఎగువ కాఫర్ డ్యాం పనులు ఆపాలని, అప్పటి కేంద్ర జలవనరుల కార్యదర్శి రాష్ట్రానికి లేఖ రాశారు. ఈ మేరకు సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ అధికారుల వాదనలు చేయడం జరిగింది. దీంతో కాఫర్ డ్యాం నిర్మాణంపై డిజైన్ రివ్యూ కమిటీ సమీక్ష నిర్వహించి, గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.