తిరుమలలో అన్యమత ప్రచారం సహించం : తితిదే ఈఓ

SMTV Desk 2018-01-05 14:33:50  ttd, eo anil kumar, another religion employees.

తిరుమల, జనవరి 5 : తితిదేలో అన్యమత ఉద్యోగుల అంశాన్ని ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తితిదే ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా అన్య మతస్థులు తితిదేలో ఉద్యోగులుగా చేరినట్లు గుర్తించామన్నారు. ఎట్టి పరిస్థితిలో అన్య మత ప్రచారాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆ ఉద్యోగులకు నోటీసులు జారీ చేశామని, వారి వివరణ తీసుకున్నాక చర్యలు తీసుకుంటామన్నారు. ఆ ఉద్యోగుల సమ్మతి ఉంటేనే వారిని తితిదే నుంచి తొలగించి ప్రభుత్వ శాఖలకు తరలించే అంశ౦పై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.