నా తక్షణ కర్తవ్యం ఉత్తరకొరియాను డీల్ చేయడం : షింజో అబే

SMTV Desk 2018-01-05 13:08:03  japan president, shinzo abe, comments on north koria,

టోక్యో, జనవరి 5 : అమెరికాకు, ఉత్తర కొరియాకు మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేలా మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జపాన్ ప్రధాని షింజో అబే ఉత్తర కొరియా చర్యలపై స్పందించారు. జపాన్ కు, ఉత్తర కొరియాకు మధ్య వివాదం కాస్త.. ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని ఉత్తర కొరియా జపాన్ మీదుగా ప్రయోగించడంతో చెలరేగింది. ఈ తాజా పరిణామాల రిత్యా అబే మాట్లాడుతూ.. "జపాన్ కు ఉత్తర కొరియాతో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న నాటి నుండే ప్రమాదం పొంచి ఉంది. దేశాలన్ని కలిసి హెచ్చరించినా ఉత్తర కొరియా తన తీరు మార్చుకోవడం లేదు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా నా దేశ ప్రజలను కాపాడుకుంటూ వారికి మెరుగైన జీవనాన్ని కల్పిస్తా. ప్రస్తుతం నేను చేయవలసిన తక్షణ కర్తవ్యం ఉత్తర కొరియాను డీల్ చేయడమే" అంటూ వెల్లడించారు.