ఈ నెల 31న తితిదే దేవస్థాన మూసివేత...

SMTV Desk 2018-01-05 11:51:08  Thirumala TTD temple closed on 31 January

తిరుపతి, జనవరి 5 : ఈ నెల 31న నిండు పౌర్ణమి రోజే చంద్రగ్రహణం రావడంతో తిరుమల శ్రీవారి దేవస్థానాన్ని మూసివేయనున్నారు. అయితే, గ్రహణ ఘడియలు ప్రారంభానికి ఎనిమిది గంటల ముందే ఆలయ తలుపులు మూసివేయనున్నారు. అనంతరం రాత్రి 9 గంటలకు తలుపులు తెరిచి ఆలయాన్ని శుద్ధి చేయడం జరుగుతుంది. కాగా, గ్రహణనికి ముందుగా ఆ రోజు పౌర్ణమి కావడంతో వేకువజామున సుప్రభాతం, తోమాల, అర్చన, సహస్ర కలశాభిషేకం సేవలను నిర్వహించారునున్నారు. ఆ పూజ కార్యక్రమాలు ముగిసిన తరువాత ఆలయ ద్వారం మూసివేయనున్నట్లు తితిదే వెల్లడించింది.