సినిమా టికెట్ల ధరలు పెంపు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

SMTV Desk 2018-01-05 10:53:02  cinima tickets increase, high court notice,

హైదరాబాద్, జనవరి 4 : రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా టికెట్ల ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు ధరలను పెంచుకోవడానికి థియేటర్లకు అనుమతినిస్తూ ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాని ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేసి మార్గదర్శకాలను రూపొందించి ఒక నిర్ణయానికి వచ్చేంత వరకు ఈ ధరలను వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. పెంచిన టికెట్ ధరల సమాచారాన్ని యంత్రాంగానికి తెలియజేయాలని హైకోర్టు స్పష్ట౦ చేసింది. ఎంత మేరకైతే ధరలను పెంచారో అంత నిష్పత్తిలో పన్నులను చెల్లించాలని వెల్లడించింది. ఆదేశాలు ఎంత మేరకు అమలవుతున్నాయో పర్యవేక్షించి ఒక నివేదిక సమర్పించాలని జాయింట్ కలెక్టర్లకు తెలియజేసింది. టికెట్ల ధరలను పెంచుకునే విషయంలో ప్రభుత్వం కాస్తంత తాత్సారం వహిస్తున్నాయని.. దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేంత వరకు అధిక ధరలను వసూలు చేసుకునే అవకాశం కల్పించాలని థియేటర్ల యజమానులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆ పిటీషన్ ను విచారించి ఈ ఆదేశాలు జారీ చేసింది.