ఐపీఎల్ -2018 రిటెయిన్‌ ఆటగాళ్ల జాబితా ఇదే..

SMTV Desk 2018-01-04 20:52:25  # IPL RETENTION, IPL-2018, MUMBAI INDIANS, CHENNAI SUPER KINGS

ముంబై, జనవరి 4 : క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ -2018 ఆటగాళ్ల రిటెయిన్‌ జాబితా బయటకొచ్చింది. ఇంతకు ముందు ఐపీఎల్ పాలక మండలి ప్రకటించిన విధంగా ఫ్రాంచైజీలు తమ దగ్గర అట్టిపెట్టుకొనే ఆటగాళ్లు వివరాలను వెల్లడించారు. టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీలకి రెండు పద్దతుల ద్వారా గరిష్ఠంగా ఐదుగురు క్రికెటర్లని అట్టిపెట్టుకునే వెసులబాటుని బీసీసీఐ పాలక మండలి కల్పించిన విషయం తెలిసిందే. ముంబయిలో నిర్వహించిన రిటెన్షన్‌ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేశారు. అందరూ ఊహాగానాలకు భిన్నంగా అభిమానుల్లో విపరీత ఆదరణ ఉన్న సన్‌రైజర్స్‌..శిఖర్‌ ధావన్‌, యువరాజ్‌సింగ్‌, కోల్‌కతా గౌతమ్‌ గంభీర్‌ను తమ దగ్గరే ఉంచుకోకపోవడం గమనార్హం. రిటెన్షన్‌ పద్ధతి 2018 నుంచి 2020 వరకూ అంటే మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. రెండేళ్ల నిషేధానికి గురైన చెన్నై, రాజస్థాన్‌ జట్లు 2015లో ఆడిన ఆటగాళ్ల నుంచి అట్టిపెట్టుకునే క్రికెటర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. కాగా జనవరి 27, 28వ తేదీల్లో బెంగుళూరులో జరిగే వేలంలో చాలా మంది స్టార్‌ ఆటగాళ్లు అందుబాటులోకి రానున్నారు. ఆటగాళ్ల వివరాలు: *ముంబై ఇండియన్స్ 1. రోహిత్ శర్మ (ఇండియా) 2. హార్దిక్ పాండ్య (ఇండియా) 3. బుమ్రా (ఇండియా) *చెన్నై సూపర్ కింగ్స్ 1. మహేంద్రసింగ్‌ ధోని (ఇండియా) 2. సురేశ్ రైనా (ఇండియా) 3. జడేజా (ఇండియా) *కోల్ కతా నైట్ రైడర్స్ 1. సునీల్ నరైన్ (వెస్ట్ ఇండీస్) 2. ఆండ్రీ రసెల్ (వెస్ట్ ఇండీస్) * సన్ రైజర్స్ హైదరాబాద్ 1. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), 2. భువనేశ్వర్ కుమార్ (ఇండియా) * రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 1. విరాట్ కోహ్లి (ఇండియా) 2. ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) 3. సర్ఫరాజ్‌ఖాన్‌ (ఇండియా) *ఢిల్లీ డేర్ డెవిల్స్ 1. రిషిబ్ పంత్ (ఇండియా) 2. శ్రేయస్ అయ్యర్ (ఇండియా) 3. క్రిస్ మోరిస్ (దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌) * రాజస్థాన్ రాయల్స్ 1. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) *కింగ్స్ X1 పంజాబ్ 1. అక్షర్ పటేల్ (ఇండియా)