విలన్ గా నటిస్తానేమో..! : ప్రభాస్

SMTV Desk 2018-01-04 15:59:26  prabhas interview, bahubali movie, director rajamouli.

హైదరాబాద్, జనవరి 4 : దర్శక ధీరుడు రాజమౌళి.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన "బాహుబలి" సినిమా కోసం ప్రభాస్ ఏకంగా ఐదు సంవత్సరాలు కేటాయించారు. అంతటి సాహసం చేశారు కాబట్టే ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రభంజనమే సృష్టించింది. అంతేకాకుండా తెలుగు సినీ పరిశ్రమ గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేసింది. కాగా ప్రభాస్ తదుపరి సినిమాలు, బాలీవుడ్ ఎంట్రీ పై స్పందించారు. పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. * బాహుబలికి ఐదు సంవత్సరాలు కేటాయించారు.. అలాగే ఇంకో కథ వస్తే కేటాయిస్తారా..? > అంత సమయం ఇవ్వను. ఒకవేళ ఇచ్చినా దానికి తగినట్లుగా మిగిలిన సినిమాలలో నటిస్తాను. మా జీవితంలో సమయం చాలా విలువైనది. అయినా "బాహుబలి" జీవితానికి ఒక అవకాశం అంతే. * బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు.? > బాలీవుడ్‌లో సినిమా చేయడానికి నేను సిద్ధమే. కేవలం అక్కడనే కాదు దేశంలోని ఏ భాషలోనైనా నేను నటిస్తాను. నాకు నచ్చాల్సింది కథ మాత్రమే. భాష, ప్రాంతం అనే హద్దులు నాకు లేవు. * విలన్ గా అవకాశం వస్తే నటిస్తారా.? > ఇప్పుడు కాదు. భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రతినాయక ఛాయలున్న సినిమాలు చేస్తానేమో.. తెలీదు. ఇప్పుడు నా దృష్టంతా ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించే సినిమాలు చేయడమే. * హిందీలో డబ్బింగ్ చెప్పుకుంటారా.? > హిందీ రాయడం, చదవడం వచ్చు. కానీ సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకోవడం కష్టమే. అక్కడి వాళ్లు మాట్లాడినంత ధారాళంగా హిందీ మాట్లాడలేను. హిందీ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా డబ్బింగ్‌ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.