నగరం నలుమూలలా ఐటీ రంగాన్ని విస్తరించాలి : కేటీఆర్

SMTV Desk 2018-01-04 13:01:32  IT Minister KTR, clasters devolopment, badvel,

హైదరాబాద్, జనవరి 4 : హైదరాబాద్ నగర శివారు బుద్వేలులో నూతన ఐటీ సముదాయాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ ఈ ప్రాంతాన్ని పరిశీలించి అనుకూలమైన 350 ఎకరాలను గుర్తి౦చారు. వచ్చే నెలలో ఈ క్లస్టర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. "నగరం నలుమూలలా ఐటీ రంగాన్ని విస్తరించాలన్నదే లక్ష్యం. దీని కోసమే దీర్ఘకాలిక లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. పెద్ద ఎత్తున ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఇందులో భాగంగానే నూతన సమూహం ఏర్పాటుపై దృష్టి సారించి అత్యుత్తమ మాస్టర్‌ ప్లాన్‌ను సిద్ధం చేశాం. తమ భూముల్ని పరిశ్రమలకు ఇచ్చేందుకు ప్రభుత్వ సంస్థలు తమ అంగీకారాన్ని తెలిపాయి. త్వరలోనే ఈ పనులన్ని కార్యాచరణలో ఉంటాయి. ఈ నూతన భవన సముదాయాలలో ప్రపంచ స్థాయి మౌళిక పరీక్షలను కల్పి౦చనున్నాం" అని వెల్లడించారు.