బసవతారకం పాత్రకు టెక్నాలజీ టెస్ట్...

SMTV Desk 2018-01-04 12:34:31  teja, nt ramarao, balakrishna,

హైదరాబాద్, జనవరి 4: తేజ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు జీవితాధారంగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రంలో బాలకృష్ణ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్రలో నటించేందుకు చాలా మంది ఆడిషన్లకు వస్తున్నారట. ఇందులో ఎవరిని ఎంపిక చేసుకోవాలో తెలియక, ఆఖరికి ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా జనవరి 18న ఎన్టీఆర్‌ వర్థంతిని పురస్కరించుకుని చిత్ర టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.