రజనీ పార్టీలో ప్రముఖలు?

SMTV Desk 2018-01-03 18:41:04  celebrities at rajani party, thamilanadu

చెన్నై, జనవరి 03 : ప్రముఖ కొరియోగ్రాఫర్‌, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో రాజకీయపార్టీని నెలకొల్పనున్నట్లు ప్రకటించిన రజినీ త్వరలో పార్టీ వివరాలు ప్రకటిస్తానని తెలిపారు. అయితే, ప్రస్తుతం రజనీ పెట్టే పార్టీలో ఎవరు చేరబోతున్నారు అన్న విషయమై తమిళనాడులో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం తన బాధ్యతలకు రాజీనామా చేసి రజనీ రాజకీయ నేతృత్వంలో చేరనున్నట్లు ప్రకటించారు. మరోపక్క రజనీ రాజకీయాల్లోకి వస్తే ఆయనతో కలిసి పనిచేస్తానని కమల్‌ ఇదివరకే పేర్కొన్నారు.కాగా, ఈ వరుసలో లారెన్స్‌ కూడా పార్టీకి మద్దతుగా నిలబోతున్నట్లు, ఈ మేరకు రేపు ప్రెస్‌ మీట్‌ ద్వారా తెలుపనున్నారని, కోలీవుడ్ వర్గాల నుంచి అందిన సమాచారం. ఇంకా ఆయన పార్టీలో ప్రముఖులు ఎవరు చెరనున్నారో వెచ్చి చూడాల్సిందే.