స్మార్ట్‌ఫోన్‌ పట్టు... ఒత్తిడి తగ్గించుకో

SMTV Desk 2017-06-20 11:45:04  smartphone,yoga, hart, gadjeetta,music, chest, jun20

హైదరాబాద్, జూన్ 20: ఈ కాలంలో ఒత్తిడి లేనిదెవరికి చెప్పండి? వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికే కాదు.. దాదాపు అందరిలోనూ ఒత్తిడే ఒత్తిడి. దీన్ని తగ్గించుకునేందుకే కదా.. కొంతమంది యోగా, వ్యాయామం బాటపడుతున్నారు.. ఇంకొందరు సంగీతం, కళారూపాలను ఎంచుకుంటున్నారు. ఇప్పుడు వీటి అవసరం అస్సలు లేదంటోంది యూకే కేంద్రంగా పనిచేస్తున్న బయోసెల్ఫ్‌ టెక్నాలజీ అనే సంస్థ. మరి ఒత్తిడికి విరుగుడు ఎలా అంటే.. ఫొటోలో ఉన్న ఈ గాడ్జెట్‌ను వాడితే చాలంటుంది. ఛాతీకి కట్టేసుకునే ఈ పరికరం పేరు సెన్సేట్‌! దీంట్లోని రకరకాల సెన్సర్లు గుండెకొట్టుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసల వేగాలతోపాటు మనం కూర్చునే తీరు, శరీర ఉష్ణోగ్రత వంటి అనేక అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూంటాయి. ఈ సమాచారాన్ని వైర్‌లెస్‌ పద్ధతిలో స్మార్ట్‌ఫోన్‌కు చేరవేస్తూంటాయి. ఈ అప్లికేషనులోని సాఫ్ట్ వేర్ సమాచారo మొత్తాన్ని విశ్లేషిoచి మనిషి ఒత్తిడికి గురిఅవుతున్నాడా!లేదా!అన్నది తెలుసుకొని అందుకు తగట్టుగా ఛాతిపై గాడ్జెట్ స్పందిస్తుంది. చెవికి వినిపించని స్థాయిలో ధ్వనితరంగాలు శరీరంలోకి పంపడం జరుగుతుంది. ఈ ప్రకపంనలు కాస్త వగాస్ నాడిని ప్రేరిపించి మనసు కుదటపడేలా చేస్తుందని ఆ కంపెనీ చెపుతుంది. ఈ సమయంలోస్మార్ట్ ఫోన్ తనవoతుగా మనసుకు హాయి కలిగిoచే సంగీతాన్నివినిపిస్తుందట. ప్రస్తుతం సెన్సెట్ అన్నది నమూనాల దశలో ఉందని, మార్కెట్లో కి పరిచయం చేయటానికి బయోసెల్ఫ్ కంపెనీ నిధులు సేకరించే పనిలోఉన్నట్లు సమాచారం. ఒక్క సెన్సెట్ ధర.రూ.14వేల ఉంటుందని వారు వెల్లడించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉదయం యోగా గురువుగా, ఒత్తిడి సమయంలో సంగీతం వినిపించే స్నేహితుడిగా పనిచేస్తుందన్నారు.