5వ తరం (5 జీ) కోసమై ఆపిల్ అన్వేషణలు...

SMTV Desk 2017-05-29 10:53:26  5G,apple,innovation 5g,mobile,

న్యూ యార్క్, మే 28 : కొత్త ఒక వింత.... పాత ఒక రోత అన్నారు... ఆవిష్కరణలు ఒకదాని తరువాత ఒకటి కొనసాగుతుంటే.. పాత వాటిని వదిలి కొత్త వాటిపై ఆసక్తిని ప్రదర్శిస్తాం.. ఇప్పుడు అదే తరహాలో ఇంటర్నెట్ సదుపాయం శరవేగంగా తన రూపాన్ని వేగాన్ని మార్చుకుంటున్నది. 4జీ సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు రాజ్యమేలుతుండగా 5జీ ఇంటర్నెట్ సాంకేతిక పరిజ్ఞానం కోసమై ఆపిల్ దిగ్గజం కసరత్తు మెుదలు పెట్టింది. ప్రస్తుతం 4జీ కంటే కొన్ని రెట్ల అధిక వేగంతో డేటాను బదిలీ చేయగల కొత్త వైర్లెస్ నెట్వర్క్ సాంకేతికతను ఆ సంస్థ అభివృద్ది చేస్తోంది. ఆ సాంకేతికత పనితీరును ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు అనుమతులు కోరుతూ ఆమెరికాలోని ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ కు దరఖాస్తు చేసింది. 1జీ, 2జీ, 3జీ, 4జీ ఇప్పుడు 5జీ వంతు రానే వచ్చింది. సంవత్సరం కాలంలో 5జీ సాంకేతికత మన చేతుల్లో ఇమిడిపోనుంది. కాలిఫోర్నియాలోని రెండు ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించి దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు. 5జీ ద్వారా మరింత వేగం, నాణ్యతలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి.