పాక్ ద్వంద వైఖరి అవలంబిస్తుంది : నిక్కీ హేలీ

SMTV Desk 2018-01-03 12:02:07  nikki haley, United States Ambassador, america, pakistan,

వాషింగ్టన్‌, జనవరి 3 : పాము స్వభావం.. పాకిస్తాన్ వైఖరి రెండు ఒక్కటే.. ఈ విషయం అమెరికాకు తెలిసిన పాముకు పాలు పోషించే పెంచే విధంగా, పాక్ కు అగ్ర రాజ్యం సైనిక, ఆర్ధిక సహకారంను అందిస్తుంది. తాజాగా పాక్ కుటిల బుద్ధిని గ్రహించిన శ్వేతాధినేత ట్రంప్ పాక్‌కు రూ.1700 కోట్ల(255 మిలియన్‌ డాలర్ల) సైనిక సహాయాన్ని నిలిపివేశారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.."పాకిస్తాన్ మా సాయం పొందుతూ మమ్మిల్ని మోసం చేయాలని భావిస్తుంది. ఆ దేశం మాతో ద్వంద వైఖరి అవలంభిస్తుంది. ఆఫ్గనిస్థాన్‌లో మా దళాలపై దాడులు జరుపుతున్న ఉగ్రవాదులకు ఆసరాగా నిలుస్తుంది. ఈ చర్యను మేము ఏ మాత్రం సహించ౦. ఉగ్రవాదంపై పోరు విషయంలో పాక్‌ నుంచి ఇంకా ఎక్కువ సహకారం మేము ఆశిస్తున్నాము” అని వ్యాఖ్యానించారు.