దటీజ్ ‘నాగ్’

SMTV Desk 2018-01-02 19:36:35  nagrjuna, fit ness image, ram gopal varma, new movie

హైదరాబాద్, జనవరి 2 : టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన నట సామ్రాట్ నాగార్జున విలక్షణ శైలి, నటనతో ఇప్పటి తరం హీరోలకు కూడా పోటీగా నిలుస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో వన్నె తగ్గని అందంతో టాలీవుడ్ మన్మధుడిగా తన స్థానం ఎవ్వరు అక్రమించలేరు. తాజాగా నాగ్, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకోసం ఆయన ఫిట్‌గా తయారయ్యారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను నాగార్జున (టీం) ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. అందులో అతని అంకితభావం మరో సారి వెలుగులోకి వచ్చింది. ఇంతకు ముందు నాగ్ ‘ఢమరుకం’ సినిమా కోసం సిక్స్ ప్యాక్ లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు కొత్త లుక్ లో ఉన్న ఫోటో పై ‘2018.. నాగ్‌-ఆర్జీవీ4’ అని రాసి ఉంది. 58 ఏళ్ల నాగ్ ఈ ఫొటోలో ఇంత ఫిట్‌గా ఉండటాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాలు తర్వాత నాగ్‌-వర్మ కలియికలో వస్తున్న ఈ చిత్రంలో నాగార్జున సరసన మైరా సరీన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ‘గన్‌’, ‘సిస్టమ్‌’ అనే టైటిల్స్‌ను ఈ సినిమా కోసం చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.