ఏపీ రాజధాని పై పార్లమెంట్ లో జైట్లీ కీలక ప్రకటన!

SMTV Desk 2018-01-02 17:01:39  ap capital amaravathi, parlament arunjaitli, mp vijayasaireddy

అమరావతి, జనవరి 02 : దేశ రాజధాని ఢిల్లీలో శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభలో అమరావతి నిర్మాణానికి నిధుల కేటాయింపు పై ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి స్పందించిన అరుణ్ జైట్లీ రాజధాని నిర్మాణానికి రూ. 3324 కోట్లు కావాలని ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును కోరిందన్నారు. ఈ అంశం ప్రపంచ బ్యాంకు పరిశీలిస్తోందన్నారు. సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిన వెంటనే రుణం మంజూరు అవుతాయన్నారు. కాగా, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే రూ. 1500 కోట్లు ఇచ్చిందని ఆయన తెలిపారు.