ప్రజల సేవాకై వెబ్‌సైట్‌ను ప్రారంభించిన రజనీకాంత్‌

SMTV Desk 2018-01-02 13:06:54  Rajinikanth started the website, chenai

చెన్నై, జనవరి 02 : సూపర్ స్టార్ రజనీకాంత్‌ ప్రజలకు సేవ చేయడానికి నూతనంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రజనీకాంత్ ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి వీలుగా అందర్నీ ఒకచోటుకు చేర్చడానికి నేను వెబ్‌సైట్‌ను ప్రారంభించా. దయచేసి మీ ఓటర్‌ ఐడీ నంబర్‌ను ఉపయోగించి పేర్లను నమోదు చేసుకోండని, ఆయన వీడియోలో చెబుతూ కనిపించారు. కాగా, ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...దేశ వ్యాప్తంగా రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి. వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లోగా కొత్త పార్టీ స్థాపించి, 234 స్థానాల్లోనూ పోటీ చేస్తానని తెలిపారు. డబ్బు, పదవి ఆశించి మాత్రం రాజకీయాల్లోకి రావడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు సేవ చేయడానికి వెబ్‌సైట్‌ను ప్రారంభించానని వెల్లడించారు.