భాజపా రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్

SMTV Desk 2017-06-19 15:13:44  BJP President Candidate Bihaar Governor Ramnath kovind,Uttar Pradesh,Kanpoor Dehat Distirict,MP,President Of Dalit Morcha

న్యూఢిల్లీ, జూన్ 19: భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రస్తుతం బీహార్ గవర్నర్ గా విధులు నిర్వహిస్తున్న రామ్ నాథ్ కోవింద్ ను నేడు భాజపా అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. రామ్ నాథ్ కోవింద్ 1 అక్టోబర్ 1945 న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దెహాట్ జిల్లాలో దేరాపూర్ పట్టణ సమీపంలో గల పరున్ఖ్ గ్రామంలో జన్మించారు. ఆయన రాజకీయ జీవితం భాజపా నుంచే ప్రారంభమైంది. రామ్ నాథ్ 1994-2000, 2000-2006 మధ్యకాలంలో రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1998 -2002 వరకు దళిత మోర్చా అధ్యక్షునిగా మాత్రమే కాకుండా అఖిల భారత కోలి సంఘ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 8 ఆగష్టు 2015 న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కోవిద్ ను బీహార్ గవర్నర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.