ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మక ధోరణి

SMTV Desk 2018-01-01 17:10:54  tehran, iran, protest, donald trump, tweet

టెహ్రాన్, జనవరి 1 : ఇరాన్ దేశంలో ఒక్కసారిగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడి ప్రభుత్వ విధానాలపై జరుగుతున్న నిరసన అంతకంతకు తీవ్రమవుతుండ౦తో అధికారులు సామాజిక మాద్యమాలను నిలిపివేశారు. గత రెండు రోజుల్లో చోటు చేసుకున్న వేర్వేరు ఘటనల్లో నలుగురు పౌరులు మృత్యువాత పడినట్లు సమాచారం. 2015 అణు ఒప్పందం తర్వాత ఇరాన్‌ ఆర్థికంగా ఎదిగిన, ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తుందంటూ ప్రభుత్వంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ప్రజా సమస్యలు పెరిగిపోవడం, ప్రభుత్వం వాటిని పట్టించుకోవడంపై ప్రభుత్వం తక్షణమే దిగిపోవాలంటూ ఆందోళనకారులు రోడ్డెక్కారు. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌ చేయడం అగ్నికి ఆజ్యం పోసింది. ఇప్పటికే వందలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు.