ప్రకృతి సేద్యం ఉత్పత్తుల భోజనమే తింటాను : చంద్రబాబు

SMTV Desk 2018-01-01 16:41:56  AP CM CHANDRABABU NAIDU, NATURAL AGRICULTURE, SHUBHAS PARIKAR.

గుంటూరు, జనవరి 1 : త్వరలోనే రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో ప్రకృతి వ్యవసాయంపై నిర్వహిస్తున్న తొమ్మిది రోజుల శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ మేరకు చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ సేద్యంపై ప్రభుత్వ సలహాదారుగా సుభాష్‌పాలేకర్‌ను నియమిస్తున్నామని ప్రకటించారు. నెలకోరోజు ఫైబర్‌నెట్‌ ద్వారా పాలేకర్‌తో శిక్షణ కార్యక్రమం ప్రసారం చేస్తామని, రైతు శిబిరాలు కూడా మూడు నెలలకోసారి నిర్వహిస్తామని పేర్కొన్నారు. తాను కూడా ఈరోజు నుండి ప్రకృతి సేద్యం ఉత్పత్తుల భోజనమే తింటానన్నారు. ఈ మేరకు జూన్‌ 5న యూఎన్‌ఈపీతో ఒప్పందం చేసుకుంటామన్నారు. మారిషస్‌ హై కమిషనర్‌ జగదీశ్వర్‌ గోవర్థన్‌ మాట్లాడుతూ.. వ్యవసాయం అనేది శూన్య పెట్టుబడితో చేస్తేనే రైతు ఆత్మహత్యలు నివారించవచ్చన్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఐదేళ్లలో ఐదు లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యానికి ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు.