రెచ్చగొడితే ఏ క్షణంలోనైనా మీట నొక్కుతా : కిమ్ జాంగ్

SMTV Desk 2018-01-01 12:13:50  North koriya president, Kim jang un, Sensational decision, Amerika,

ప్యాంగ్యాంగ్, జనవరి 1 : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్.. అమెరికా తమ దేశంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఏ క్షణానైనా అణు దాడి జరగవచ్చని హెచ్చరికలు జారీ చేశారు. నూతన సంవత్సర వేడుకల నిమిత్తం కిమ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఎప్పటికి అమెరికా ఉత్తర కొరియాపై యుద్ధం చేయలేదు. కాని ఆ దేశాన్ని నాశనం చేసే శక్తి మాత్రం మా అణు ఆయుధాలకు ఉంది. మా దేశం గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం వదిలేది లేదు. అణు బటన్‌ ఎల్లప్పుడూ తన టేబుల్‌ మీదే ఉంటుంది" అంటూ పేర్కొన్నారు.