64 వ ఫిలిం ఫేర్ అవార్డులో ఉత్తమ నటుడు గా ఎన్ టీఆర్

SMTV Desk 2017-06-19 13:42:52  64 film fare awards, ntr,allu arjun,nayanatara

హైదరాబాద్, జూన్ 19: 64 వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ ను ఈ ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగిన ఈ వేడుకలో సౌత్ ఇండియన్ సినిమా నటినటులు అల్లు అర్జున్, ఎన్ టిఆర్, రానా, నయనతార, రకుల్ ప్రీత్ సింగ్, ఎఆర్ రెహమాన్, సూర్య, జ్యోతిక,కుష్బూ, మాధవన్,సుహాసిని వంటి నటినటులు తో పాటు చాలా మంది ఈ వేడులలో పాల్గొన్నారు. ఇందులో జరిగిన ఆటపాటలు, కామెడీ, విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. 64 వ ఫిలిం ఫేర్ అవార్డులో భాగంగా ఈ ఉత్తమ నటుడిగా (నాన్నకు ప్రేమతో ) సినిమాకు గాను జూనియర్ ఎన్ టిఆర్ ఈ అవార్డు ను అందుకున్నాడు. టాలీవుడ్ సినిమాలకు వచ్చిన అవార్డ్స్ వివరాలు * ఉత్తమ నటుడు: ఎన్ టిఆర్ (నాన్నకు ప్రేమతో ) * ఉత్తమ నటి: సమంత ( అ ఆ ) * సహాయ నటుడు: జగపతి బాబు ( నాన్నకు ప్రేమతో ) * ఉత్తమ సహాయ నటి: నందితా శ్వేతా ( ఎక్కడికి పోతావ్ చిన్నవాడా) * ఉత్తమ చిత్రం : పెళ్లి చూపులు * ఉత్తమ దర్శకుడు : వంశీ పైడిపల్లి (ఉపిరి) * ఉత్తమ గాయని : చిత్ర (నేను శైలజ - ప్రేమకి) * ఉత్తమ గాయకుడు : కార్తీక్ (అ ఆ - వెళ్ళిపోకే శ్యామల) * ఉత్తమ గేయ రచయిత : రామజోగయ్య శాస్త్రి ( ప్రణామం, పాట జనత గ్యారేజ్ ) * ఉత్తమ సంగీత దర్శకుడు : దేవిశ్రీ ప్రసాద్ (నాన్నకు ప్రేమతో) * ఫిలింఫేర్ క్రిటిక్ అవార్డు (నటుడు) : అల్లు అర్జున్ (సరైనోడు) * ఫిలింఫేర్ క్రిటిక్ అవార్డు ( నటి) : రీతూ వర్మ ( పెళ్లి చూపులు)