“అ!” నుంచి కాజల్ అగర్వాల్ పోస్టర్...

SMTV Desk 2017-12-31 14:05:45  awe movie update, kajal agarwal poste awe movie.

హైదరాబాద్, డిసెంబర్ 31: న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా పతాకంపై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆ!’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ఒక్కొక్కరి పాత్రను పరిచయం చేస్తూ వారి ఫోటోలతో కూడిన పోస్టర్లను విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు నిత్యామీనన్, అవసరాల శ్రీనివాస్, ఇషారెబ్బ, రెజినా కసాంద్రా లతో పాటు ఓ చేపకు వాయిస్ ఓవర్ ఇస్తున్న నాని పోస్టర్, హీరో రవితేజ ఓ మొక్కకు వాయిస్ ఓవర్ ఇస్తున్న పోస్టర్లను విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో నటిస్తున్న కాజల్ అగర్వాల్ కు చెందిన ఓ పోస్టర్ ను చిత్ర బృందం అభిమానులతో పంచుకున్నారు. ఇందులో కాజల్ దిగాలుగా ఓ రోజా పువ్వును పట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఈ పోస్టర్ అందరిని ఆకర్షించిస్తుంది.