పాక్‌కు అమెరికా ప్రతి ఏటా అందించే ఆర్థిక సాయం నిలిపివేత!

SMTV Desk 2017-12-31 12:04:26  pak america relation Financial aid donal trump

వాషింగ్టన్, డిసెంబర్ 31 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రతి ఏటా పాకిస్తాన్ కు కోట్ల డాలర్లు అందించే ఆర్థిక సాయాన్ని ఎట్టకేలకు నిలిపివేయాలని యోచిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఒక వార్తాకథనం ద్వారా తెలుస్తోంది. అమెరికా దేశం 2002 నుంచి ఏటా పాకిస్థాన్‌కు 3300 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అందజేస్తుంది. కానీ పాక్ మాత్రం తన భూభాగంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని ట్రంప్‌ ఇటీవల ప్రకటన చేసినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు క్రమంగా సన్నగిల్లుతున్నాయని ఆ పత్రిక పేర్కొంది. ఈ మేరకు మరి కొన్ని రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రికలో తెలిపింది.