ఐక్యరాజ్యసమితిలో భారతీయ మహిళ కు అరుదైన గౌరవం

SMTV Desk 2017-06-19 12:46:39  UNO, ITLOS,Indian Lady Neeru chadha,Indoneshiya,

న్యూయార్క్, జూన్ 19 : ఐక్యరాజ్య సమితిలోభారతీయ మహిళా న్యాయామూర్తి కి ఉన్నత పదవి దక్కింది. సముద్ర జలాల వివాదాలను పరిష్కరించే ఇంటర్నేషనల్‌ ట్రిబ్యునల్‌ ఫర్‌ ది లా ఆఫ్‌ ది సీ(ఐటీఎల్‌ఓఎస్‌)కు భారత్‌కు చెందిన న్యాయ నిపుణురాలు నీరు చాధా జూన్ 15 న ఎన్నికయ్యారు. ఈ ట్రిబ్యునల్‌కు జడ్జిగా నియమితులైన తొలి భారత మహిళ ఆమెనే కావడం విశేషం. చాధా ఈ పదవిలో 2017 నుండి 2026 వరకు 9 సంవత్సరాలు ఉంటారు. చాదా, ఆసియా పసిఫిక్ గ్రూపులో 120 ఓట్లు అత్యధికంగా గెలిచి మొదటి రౌండ్లో ఎన్నుకోబడింది. ఇండోనేషియా అభ్యర్థికి 58 ఓట్లు లభించగా, లెబనాన్, థాయిలాండ్ అభ్యర్థులు వరుసగా 60, 86 ఓట్లు సాధించారు. రెండో రౌండు కౌంటింగ్ లో ఆసియా పసిఫిక్ గ్రూపులో తన ఆధిక్యతను నిలుపుకుంది. ప్రముఖ లాయర్‌ అయిన చాధా విదేశాంగ శాఖలో ముఖ్య న్యాయ సలహాదారుగా పనిచేసిన తొలి మహిళగా పేరుగాంచారు.