కేసీఆర్ పతనం ప్రారంభమైంది : ఉత్తమ్

SMTV Desk 2017-12-30 17:02:00  TPCC President uttam kumar reddy, comments on kcr.

హైదరాబాద్, డిసెంబర్ 30 : కేసీఆర్ పతనం ప్రారంభమైంద౦టూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ‘సాంస్కృతిక సేన’ ఆవిర్భావ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం మాల మాదిగలకు గాని, మహిళలకు గానీ మంత్రి పదవి ఇవ్వని అన్యాయమైన ప్రభుత్వం. కాంట్రాక్టర్ల నుంచి వచ్చే 6 శాతం కమిషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టులను చేపడుతారు. కేసీఆర్‌ మోసాలపై పల్లె పల్లెనా తిరిగి ప్రచారం చేయాలి. కేసీఆర్‌ పెద్ద తీస్మార్‌ఖాన్‌ ఏం కాదు. ఆయనను మించిన కిలాడీలను తెలంగాణ చాలా చూసింది. ఆయన పెద్ద లెక్కేమీ కాదు. ఆయన పతనం ప్రారంభమైంది. టీపీసీసీ సాంస్కృతిక సేన కళాకారుల ప్రదర్శన చూశాక మరింత నమ్మకం కలిగింది. టీఆర్‌ఎస్‌ దగాపై ఇక పాట తూటాలా పేలాలి. ఆయనను గద్దె దించాలి" అంటూ విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ‘జయ జయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించి, అందెశ్రీని తగిన విధంగా గౌరవిస్తామన్నారు.