గ్లోబల్‌ వార్మింగ్‌ మంచిదే : ట్రంప్

SMTV Desk 2017-12-30 11:27:39  GLOBAL WARMING, DONALD TRUMP, COMMENTS, AMERICA.

వాషింగ్టన్, డిసెంబర్ 30 : ప్రపంచమంతా గ్లోబల్‌ వార్మింగ్‌ ను అరికట్టాలని ప్రయత్నాలు చేస్తుంటే అమెరికా అధ్యక్షుడు మాత్రం గ్లోబల్ వార్మింగ్ మంచిదే అంటున్నారు. ప్రస్తుతం తూర్పు అమెరికా తీరం నుండి అతి శీతల గాలులు వీస్తున్నాయి. న్యూ ఇయర్‌ వేడుకలకు ఆ ప్రాంతమంతా అత్యంత శీతలంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. "గ్లోబల్‌ వార్మింగ్‌ వేడి పుణ్యమా..! మనకు వాతావరణం మాత్రం సాధారణం కంటే కాస్త వేడిగానే ఉండనుంది. భూతాపంతో అమెరికాకు మంచే జరగనుంది. కానీ ఇతర దేశాల్లో అలాంటి పరిస్థితి లేదు. ఆయా దేశాలు అతి శీతల గాలులను ఎదుర్కోవాల్సిందే. వేల కోట్లను ఖర్చు చేయక తప్పదు" అంటూ చెప్పుకొచ్చారు.