విద్యుత్ చార్జీల పెంపు లేనట్లే...

SMTV Desk 2017-12-29 18:28:49  Electricity charge, TSERC, NPDCL, SPDCL

హైదరాబాద్, డిసెంబర్ 29 : ఇకపై విద్యుత్తు చార్జీల విషయంలో బహిరంగ విపణి(ఓపెన్‌ యాక్సెస్‌) వినియోగదారులపై అదనపు సర్‌చార్జి 92 పైసలే విధించాలని టీఎస్ఈఆర్‌సీ గురువారం ఉత్తర్వులిచింది. ఈ మేరకు విద్యుత్తు చార్జీలను పెంచరాదని డిస్కంలు నిర్ణయించాయి. వార్షికాదాయ అవసరాలు(ఏఆర్‌ఆర్‌) రూ.35,774 కోట్లుకు చేరినా.. వినియోగదారులపై భారం వేయకూడదని నిర్ణయానికి వచ్చాయి. అయితే, 2018-19లో మాత్రం డిస్కంలు రూ.2.06కు ఆమోదించాయి. హైదరాబాద్‌ మెట్రో రైలుకు యూనిట్‌ను రూ.3.95, ఓపెన్‌ యాక్సెస్‌ జపం చేస్తున్న రైల్వేకు యూనిట్‌ను రూ.4.05కు ఇవ్వాలని ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదనలపై జనవరి 23లోగా అభ్యంతరాలు తెలియజేయాలని టీఎస్ ఈఆర్‌సీ నోటిఫికేషన్‌లో కోరింది. దీనిపై ఫిబ్రవరి 8న ఎన్పీడీసీఎల్‌, 12న ఎస్పీడీసీఎల్‌ పరిధిలో బహిరంగ చర్చలు నిర్వహించనున్నారు.