యువతిపై కన్నడ నటుడి అత్యాచారం...

SMTV Desk 2017-12-29 17:04:20  kannada actor subramanya, rape case, ,

బెంగుళూరు, డిసెంబర్ 29: తనపై ఓ కన్నడ నటుడు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... కన్నడ నటుడు సుబ్రమణ్య, స్వప్న ఇద్దరు ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా చిగురించి పెళ్లి చేసుకునేదాకా వచ్చింది. ఈ నేపథ్యంలో సుబ్రమణ్య, నవంబర్‌ 1న తన సోదరి ఇంట్లో పార్టీ ఉందనిచెప్పి స్వప్నను పిలిచాడు. పార్టీకి వెళ్లిన స్వప్నకు మత్తు మందు కలిపిన డ్రింక్‌ ఇచ్చి తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత పెళ్లి చేసుకోమంటే మొహం చాటేశాడని వాపోయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.