మరో మాంజీ

SMTV Desk 2017-05-29 10:46:47  manji,brevoman,honestey man,china manjii

చైనా, మే 27 : దశరథ్ మాంజీ: భోజనం తీసుకోస్తుండగా కాలు జారి పడిపోయి తీవ్ర గాయాలపాలై; కొండపై నుండి ఆసుపత్రికి తీసుకెలుతుండగా ఆ మార్గమధ్యంలోనే మరణిస్తుంది అతని భార్య ఫల్గుని దేవి. ఆమె మరణంతో తీవ్ర మనస్తాపానికి గురై, తన కష్టం గ్రామస్థులెవరికి రాకూడదనే ఉద్దేశ్యంతో కొండను తొలచి రోడ్డు మార్గం సుగమం చేసాడు మాంజీ. అదే కథాంశంతో తీసిన బాలివుడ్ చిత్రం "మాంజి: ది మౌంటెన్ మాన్", మనసున్న ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. మాంజీ కోవకు చెందిందే ఝంగ్ జివెన్ జీవితం. తమ గ్రామస్థుల కోసమై ఐదేళ్ళ పాటు కష్టపడి కొండను త్రవ్వి పటిష్టమైన రహాదారిని నిర్మించి అందరి చేత మన్ననలు అందుకున్నాడు 76 ఏళ్ళ వృద్దుడు ఝాన్ జివైంగ్. చైనాలోని పులింగ్ అడవుల్లోని మారుమూల గ్రామాల్లో పుట్టి పెరిగిన ఝావేంగ్ ఉపాధి కోసమై సమీప పట్టణానికి వెళ్ళి స్థిరపడ్డారు. అయితే తమ గ్రామానికి చెందిన పిల్లలు, గ్రామస్థులు కొండను దాటి వెళ్ళడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని ఐదేళ్ళ పాటు కష్టపడి రోడ్డును నిర్మించాడు. ఎత్తైన కొండల మధ్య టూరిస్ట్ ప్లేస్ కు వెళుతున్నట్లుగా వంతెనలు, సేదతీరేందుకు మార్గంలో కుర్చీలతో ఆకర్షీణియంగా దారిని తీర్చిదిద్దారు. కొండలను తొలిచి దారి తీస్తున్న క్రమంలో ఆయన చెవులు వినపడకుండా పోయాయి. వినికిడి లేక పైనుండి రాళ్ళు పడుతున్న విషయం గమనించలేక గాయాలపాలయ్యాడు. కాళ్ళు చేతులు విరిగాయి. అయినా ఆ అలుపెరుగని యోధుడు తమ గ్రామస్థుల కోసమై రోడ్డును నిర్మించి చూపాడు.