నేడు కాంగ్రెస్ 133వ జాతీయ ఆవిర్భావ దినోత్సవం

SMTV Desk 2017-12-28 14:48:26  Congress Party 133National Day, Uttamkumarreddy hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 28 : నేడు కాంగ్రెస్ పార్టీ 133వ జాతీయ ఆవిర్భావ దినోత్సవం కావడంతో, హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ జెండాను ఎగురవేసిన అనంతరం, మాట్లాడుతూ...ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీ కాంగ్రెస్. అయితే, దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలోనూ.. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలోనూ కాంగ్రెస్ కీలకపాత్ర పోషించిందని, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దళిత, బడుగు బలహీన వర్గాలపై దాడులు మితిమీరిపోతున్నాయన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో అన్ని పార్టీలు అంగీకరించినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లడం లేదని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.