ఐశ్వర్యరాయ్ డబుల్ యాక్షన్ చేస్తుంది..: నిర్మాత ప్రేరణ

SMTV Desk 2017-12-28 14:29:32  aishwarya rai, new movie, fancykhan, producer prerana.

ముంబాయి, డిసెంబర్ 28: “ఫ్యానీఖాన్” చిత్రంతో బిజిబిజిగా ఉన్న ఐశ్వర్యరాయ్ తన తరువాత చిత్రంలో ద్విపాత్రాభినయంతో అలరించనున్నట్లు నిర్మాత ప్రేరణ తెలిపారు. “ఫ్యానీఖాన్” చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రేరణ, ఐష్ తదుపరి చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా తెర‌కేక్కబోతుందని, అందులో ఐష్ డబుల్ యాక్షన్ చేస్తుందని, ఈ చిత్రానికి కూడా తనే నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభిస్తామని, యూరప్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ‘ఫ్యానీ ఖాన్’ సినిమా 2018 రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.