ఏపీ సీఎం నివాసం వద్ద బాధితుల ఆందోళన...

SMTV Desk 2017-12-28 14:19:31  Ebrahimatman road expansion victims issue ap cm chandrababu naiduhome

విజయవాడ, డిసెంబర్ 28 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వద్ద నేడు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం రహదారి విస్తరణ బాధితులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో ఇళ్లను కోల్పోయామని వెంటనే తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కిరోసిన్ సీసాలతో బైటాయించి, నిరసన తెలిపారు. ఒకరు ఒంటి మీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేయగా, భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి ఇంటి వద్ద ఎలాంటి నిరసనలు చేయరాదని చెప్పి, వారిని అక్కడి నుంచి పంపివేశారు.