భారత బ్యాడ్మింటన్‌కు పెద్ద షాక్‌..!

SMTV Desk 2017-12-27 12:19:18  mulyo handoyo, badminton coach, india, pbl league

ముంబయి, డిసెంబర్ 27: ప్రస్తుత భారత్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో అనూహ్యమైన ప్రగతి సాధించడానికి కారణం ఇండొనేసియాన్ కోచ్‌ ముల్యో హండోయో. ఆయన పనితనంపై ప్రధాన కోచ్‌ గోపీచంద్‌ సైతం చాలా సార్లు ప్రశంసల వర్షం కురిపించాడు. ముల్యో కోచ్‌ అయ్యాక పురుషుల సింగిల్స్‌లో ఈ ఏడాది కిదాంబి శ్రీకాంత్‌ నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు గెలవడంతోపాటు, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ సహా మిగతా క్రీడాకారుల ఆట కూడా మెరుగైంది. కాగా ఇటువంటి పటిష్ట పరిస్థితిలో ఆయన, వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమచారం. ఇదే నిజమైతే భారత బ్యాడ్మింటన్‌కు పెద్ద షాక్‌ తగిలినట్లే. ప్రస్తుతం జరుగుతున్న ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ ముగిసిన అనంతరం ముల్యో రాజీనామా సమర్పించే అవకాశముంది. భారత్‌లో ఉండటానికి అతడి కుటుంబం బాగా ఇబ్బంది పడుతుండటంతో అతను స్వదేశానికి వెళ్లిపోవాలన్న నిర్ణయానికి వచ్చాడని తెలుస్తుంది.