నెత్తురోడిన జాతీయ రహదారులు

SMTV Desk 2017-05-27 14:07:02  national highways, , road accident, speed car

ఉత్తర్ ప్రదేశ్, మే 25 : ఉత్తరప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. అహ్మద్ నగర్-మన్మాడ్ ప్రధాన జాతీయ రహదారిలో ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. జాతీయ మార్గాలలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు నామ మాత్రంగా ఉండడంతో ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్నదనే ఆందోళన వ్యక్తం అవుతున్నది. వేగ నియంత్రణకు ప్రత్యేక చర్యలు లేకపోవడం ద్వారా ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతున్నది. అదే విధంగా తెలంగాణలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కారు-లారీని డీ కొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ స్థాయిలో రోడ్డు ప్రమాదాల ద్వారా మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా మానవ తప్పిదాల వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, అలసి పోవడం...కాస్త కునుకు తీయడం వంటి వాటి కారణంగానే రోడ్డు ప్రమాదాలు శ్రుతి మించుతున్నాయని భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉంది.