క్రిస్మస్ వేడుకల్లో సీఎం చంద్రబాబు

SMTV Desk 2017-12-24 18:05:43  Christmas celebrations with ap cm chandrababu naidu

అమరావతి, డిసెంబర్ 24 : యేసుక్రీస్తు ప్రవచించిన క్షమా, దయ గుణాలు ప్రపంచానికే ఆదర్శమని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నారు. నేడు గుంటూరులో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఆయన క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. నవ్యాంధ్ర నిర్మాణానికి జిసేస్ ఆశీస్సులు ఉంటాయని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చర్చిల మరమ్మతులకు ఇచ్చే మొత్తాన్ని రూ.3లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచుతున్నామని, రానున్న బడ్జెట్‌లో గణనీయంగా నిధులు పెంచుతామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నక్క ఆనంద్ బాబు, జోహార్, ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.