ముంబయి నగర వాసులకు క్రిస్మస్‌ సర్ ప్రైజ్

SMTV Desk 2017-12-24 12:19:01  The first AC suburban train in mumbai, Christmas Surprise

ముంబయి, డిసెంబర్ 24 : ముంబయి వాసులకు క్రిస్మస్‌ కానుకగా తొలి ఏసీ సబర్బన్‌ రైలు పట్టాలెక్కనుంది. కొన్ని ఏళ్ల తరబడి దీనిపై చర్చ, ప్రణాళికలు జరిపి మరీ, ఈ క్రిస్మస్‌ నుంచి తొలిసారిగా ఏసీ ప్రయాణాన్ని ప్రయాణికులకు ఈ నెల 25న అందుబాటులోకి తేనున్నారు. అయితే, మొత్తం 12 రోజువారీ సర్వీసుల్లో ఎనిమిదింటిని అత్యంత రద్దీ మార్గమైన చర్చిగేట్‌-విరార్‌ మధ్య తిప్పనున్నట్లు చెప్పారు. ఏసీ సబర్బన్‌ రైళ్లను శని, ఆదివారాలు తప్ప మిగతా అన్ని రోజుల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి ఏసీ రైలు అంధేరీలో మధ్యాహ్నం 2.10 నిమిషాలకు బయలుదేరి చర్చిగేట్‌ స్టేషన్‌కు 2.44 నిమిషాలకు చేరుకోనుంది. దీని అనంతరం, మరో ఆరు ఏసీ సబర్బన్‌ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు పశ్చిమ రైల్వే అధికారులు వెల్లడించారు. ఇందుకోసం చెన్నైలోని కోచ్‌ ఫ్యాక్టరీలో అధునాతన బోగీలను రూపొందించారు. పూర్తి ఏసీతో కూడిన ఒక్కో బోగీలో 6వేల మంది ప్రయాణించే వీలుంది. ఆటోమెటిక్‌ డోర్లు, ఎల్‌ఈడీ దీపాలు, అడ్వాన్స్‌డ్‌ జీపీఎస్‌ సిస్టమ్‌తో కూడిన ఈ రైళ్లు 100 కి.మీ వేగాన్ని అందుకోగల,దీన్ని 1867లో ముంబయిలో సబర్బన్‌ రైలు నెట్‌వర్క్‌ ప్రారంభమైంది. ముంబయి సబర్బన్‌ రైలు నెట్‌వర్క్‌ చరిత్రలో ఏసీ కోచ్‌లు ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం.