విచారణలో దర్శకుడిని కాలుతో తన్నిన.. పొలీస్

SMTV Desk 2017-12-23 13:19:09  short film actor harrasment, police station, director yogi, dcp gangareddy, hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 23 : షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్ యోగి తనను వేధిస్తున్నాడంటూ, హారిక అనే యువతి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫేస్ బుక్ ద్వారా కొన్ని నెలల క్రితం పరిచయమైన యోగి తన నుంచి రూ.10వేలు తీసుకోవడమే కాకుండా అశ్లీల సందేశాలు పంపిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. మరో ముగ్గురు అమ్మాయిలను కూడా ఇలాగే వేధించినట్లు బాధితురాలు వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆ నిందితుడిని డీసీపీ గంగారెడ్డి శుక్రవారం రాత్రి పొలీస్ స్టేషన్ కు పిలిపించి విచారిస్తూ కాలుతో తన్నడం, చంపపై కొట్టడం చర్చనీయంశామైంది. ఆ విచారణను రహస్యంగా చరవాణిలో చిత్రీకరించిన ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.