అటువంటి వాటిని నమ్మవద్దు : అరుణ్‌జైట్లీ

SMTV Desk 2017-12-23 12:22:26  central finance minister, arun jaitley, 2000 currency, new delhi

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: 2016 నోట్లు రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం నకిలీ నోట్లును ఆరికట్టేందుకు నూతన రూ.500, రూ. 2000 నోట్లను విపణిలొకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా ఎస్‌బీఐ ఇటీవల చేసిన పరిశోధన ప్రకారం.. ఆర్‌బీఐ వద్ద దాదాపు రూ.2,46,300కోట్ల విలువైన రెండు వేల నోట్లు ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆర్‌బీఐ రూ.2000నోట్ల ముద్రణను నిలిపివేస్తుందని వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు. ఈ విషయం పై ఆయన మీడియాతో మాట్లాడుతూ..." రెండు వేల నోట్ల ముద్రణను నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ వదంతులే. అవన్నీ ఊహాగానాలు. ఇటువంటి వాటిపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఎవరు నమ్మవద్దు" అని వ్యాఖ్యానించారు.