మూడు రోజుల పండగకు సకల ఏర్పాట్లు

SMTV Desk 2017-05-29 10:36:46  tana,america,uthara america telugu association

అమెరికా, మే 27 : తెలుగు సాంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు వాటి వ్యాప్తికి ఆవిర్భవించిన ఉత్తరమెరికా తెలుగు సంఘం వార్షికోత్సవాలకు సర్వం సిద్దం అయింది. ఈనెల 27 నుండి మూడురోజుల పాటు కార్యక్రమాలు అత్యంత విశేషమైన రీతిలో కొనసాగనున్నాయి. 1977లో ప్రారంభమైన తానా.. ప్రస్తుతం నిర్వహించే సమావేశాలతో 21వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. సాంస్కృతిక సంప్రదాయాలను పరివ్యాప్తం చేయడంతో పాటు వారి సంతతి యొక్క గుర్తింపును కాపాడడానికి, సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సాంఘిక, స్వచ్చంద సేవా చర్చలకు ప్రత్యేక వేదికగా తానా సభలు నిలుస్తున్నాయి. తెలుగు తేజం ఎన్ టిఆర్ తో తానాకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. మహాసభలకు ప్రపంచ నలుమూలల నుండి తెలుగువారు భారీగా తరలివస్తున్నారు. మహాసభలను ప్రతిష్టాత్మకంగా, ప్రత్యేక రీతిన నిర్వహించేందుకు నిర్వాహక కమిటీలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ప్రత్యేక వేదికతో ఆహుతులను ఆకర్షించేందుకు మహావేదికను సిద్దం చేస్తున్నారు. మహాసభలలో భాగంగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సంగీత, సాహిత్య కార్యక్రమాలతో పాటు పలు ప్రత్యేక కార్యక్రమాలతో సందడి వాతావరణం నెలకొననుంది. అమెరికాలో తెలుగువారికి తానా మహసభలు పండగ వాతావరణాన్ని, ఆనందాన్ని అందించనున్నాయి. తానా మహసభలు వచ్చాయంటే తెలుగువారిలో ఎంతో ఉత్సాహం కలుగుతుంది. దేశం నుండి తరలివెళ్ళే ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సినిమా నటులతో ఆప్యాయంగా గడిపేందుకు తానా వేదిక ఆత్మీయంగా స్వాగతం పలుకుతోంది.